రాజోలు: సార్వా వరి కోతల్లో నిమగ్నమైన రైతులు

రాజోలు మండలంలోని పలు గ్రామాల్లో సార్వా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక పక్క కూలీల కొరత మరోపక్క వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఎక్కువ శాతం మంది రైతులు వరి కోత యంత్రాల ద్వారా కోతలు కోయిస్తున్నారు. అయితే పలు గ్రామాలలో మాత్రం పశువులకు ఎండు గడ్డి కోసం రైతులు కూలీలతో వరి కోత కోయిస్తున్నారు. అదే సమయంలో కూలీల కొరత కూడా ఉందని రైతన్నలు గురువారం చెప్పారు.

సంబంధిత పోస్ట్