స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను జయప్రదం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను గురువారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. సుమారు 30 కార్పొరేట్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులకు 13, 14, 15 తేదీల్లో నేషనల్ కాలేజ్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.