మచిలీపట్నం: మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

ఈనెల 17వ తేదీన అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్