మచిలీపట్నం జిల్లా కోర్టు రోడ్డులో ఉన్న వైసీపీ జిల్లా ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి మంగళవారం రాత్రి నెలకొంది. కోర్టు స్టేలో ఉన్న వైసీపీ ఆఫీస్ లో బుధవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ మంత్రి నాని పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. డీఎస్పీ సీహెచ్ రాజా చర్చలు జరుపుతున్నారు. స్టేలో ఉన్న ఆఫీస్ లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పేర్ని నానిని అక్కడ నుంచి పంపించి వేశారు.