నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్ల మండలంలోని రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఈ అకాల వర్షాలు వలన రైతులను నట్టేట ముంచుతున్నాయి. అతివృష్టి అనావృష్టి రైతుల పారిట శాపంగా మారుతుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట చేతికి అంది వస్తుందో అని నమ్మకం లేదు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.