విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలు పాటించాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినవారిపై చలానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.