విజయవాడలోకి లారీల ప్రవేశం నిర్దేశిత సమయాల్లోనే ఉంటుందని ఏసీపీ పవన్ కుమార్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వెస్ట్ బైపాస్పై టోల్ చెల్లించకుండా నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించి టోల్ ఎగవేసే వాహనాలకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వాహనదారుల సహకారం కోరారు.