విజయవాడ నగరంలో ఆదివారం ఫుడ్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన సైడ్ డ్రైనేజీలో పడిపోయిన రెండు ఆవులను ట్రాఫిక్ సీఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో స్పందించి మూగజీవాల ప్రాణాలను కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.