ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టరుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలక్కియ ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం విజయవాడలోని జేసీ వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.