జిల్లాలో బర్డ్‌ఫ్లూ నియంత్రణలోనే ఉందని, అయినా అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. వైరస్ నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతర పర్యవేక్షణతో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయన్నారు.