వరద ప్రవాహ వేగానికి అవనిగడ్డ మండలం ఎడ్లంక దీవి గ్రామానికి వెళ్లే రేవు బాట కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు రెవిన్యూ అధికారులు ఎడ్లంక వాసుల రాకపోకల కోసం పడవ ఏర్పాటు చేశారు. తహశీల్దార్ కే. నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ కే. శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎడ్లంక వాసులకు సహాయక చర్యలు, ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు చేపట్టారు.