చల్లపల్లి: బాణాసంచా దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి

అవనిగడ్డ డీఎస్పీ రావూరి అభిషేక్, శుక్రవారం సాయంత్రం మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్సుల చెల్లుబాటు, నిల్వ పరిమాణం, అగ్నిప్రమాద నివారణకు భద్రతా చర్యలు, నీటి సౌకర్యం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల అందుబాటు వంటి అంశాలను పరిశీలించారు. దుకాణ యజమానులు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్