ఘంటసాల: ఇసుక క్వారీ వద్ద లారీలు అడ్డుకున్న సభ్యులు

ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం ఇసుక క్వారీ వద్ద ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సొసైటీ సభ్యులు గురువారం ఆందోళన చేపట్టారు. తమకు తెలియకుండా క్వారీని ప్రారంభించారని సభ్యులు ఆరోపించారు. ఘంటసాల ఎస్సై వేమన చందన సంఘటనా స్థలానికి చేరుకుని సొసైటీ సభ్యులతో మాట్లాడారు. కృష్ణాజిల్లా అధికారులు క్వారీకి అనుమతులు మంజూరు చేసినట్లు ఆమె వివరించడంతో సమస్య సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్