కోడూరు: తహసిల్దార్ కార్యాలయం తనిఖీ

గురువారం కోడూరు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) చంద్రశేఖర రావు తనిఖీ చేశారు. ఆయన కార్యాలయంలోని రికార్డులు, మ్యుటేషన్ ఫైల్స్, రెవెన్యూ రిజిస్టర్లను పరిశీలించి, మండలంలో జరుగుతున్న భూ రీసర్వేపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను తప్పులు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయ గదులను కూడా పరిశీలించారు. ఈ తనిఖీలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్