కోడూరు: గ్రామాలలో తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలి

వేసవి దృష్ట్యా మండలంలోని ఏ గ్రామంలోనూ తాగునీటి కొరత రాకుండా చూడాలని, అందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోడూరు ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి తెలిపారు. బుధవారం కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. పలు గ్రామాల ఎంపీటీసీలు తమ పరిధిలోని చేతి పంపు బోర్లు వట్టిపోతున్నాయని, పాత పైపులైన్లు లీకేజీ అవుతున్నాయని, వాటి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్