కోడూరు: మహిళల భద్రత సామాజిక బాధ్యత: డీఎస్పీ

అవనిగడ్డ డిఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ, మహిళల భద్రత, సంక్షేమం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, యావత్ సమాజం కలిసికట్టుగా తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత అని అన్నారు. గురువారం కోడూరు ప్రధాన రహదారుల వెంబడి అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు మహిళల భద్రతపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్నవారు మహిళల రక్షణపై ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్