ఉంగుటూరు: 'నా చావుకు పంచాయతీదే బాధ్యత'

ఉంగుటూరు మండలం వేంపాడులో నివాస స్థలాల వివాదం తీవ్రమైంది. 50 ఏళ్లుగా నివసిస్తున్న తమను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో బాధితులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. 1994లో అధికారికంగా పట్టా పొందిన తమను, విలేజ్ క్లినిక్ పేరుతో ఖాళీ చేయమనడం అన్యాయమని 95 ఏళ్ల వృద్ధులు వాపోయారు. రోడ్డున పడలేమని, తమకు ఏదైనా జరిగితే పంచాయతీదే బాధ్యత అని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్