రిజర్వ్ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా బ్యాంకర్లు విధిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని గుడివాడ డిఎస్పి వి. ధీరజ్ వినీత్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం గుడివాడలోని గౌరీ శంకరపురంలోని డిఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ ధీరజ్ వినీల్ పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పోలీస్ శాఖ, బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.