గుడివాడ టిడ్కో గృహాల వద్ద శనివారం ఎస్ఐ చంటిబాబు ఆధ్వర్యంలో జనచైతన్య అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అత్యవసర నంబర్లను వివరిస్తూ, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.