ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడకుండా పైపులైన్ నిర్మాణం చేపడుతున్నారని, తమ నివాసాలను తొలగించడాన్ని నిరసిస్తూ పోలుకొండ గ్రామంలోని చంద్రయ్య కాలువ కరకట్టపై నివాసముంటున్న నిరుపేద ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు. దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్న బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన ఎస్టీ వర్గాలు పంచాయతీకి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు.