జగ్గయ్యపేటలో కరెంట్ కష్టాలు..!

జగ్గయ్యపేటలో విద్యుత్ సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 10 రోజుల క్రితం గాలివాన కారణంగా పడిపోయిన విద్యుత్ స్తంభాల మరమ్మతుల పేరుతో రోజుకు గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీనివల్ల ప్రజలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్