పెనుగంచిప్రోలులో అడ్డదిడ్డంగా రాకపోకలు...

పెనుగంచిప్రోలులోని నాలుగు రహదారుల కూడలిలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. విద్యార్థులు, మార్కెట్కు వచ్చేవారు, వాహనాల రద్దీతో ఇరుకైన సెంటర్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటోలు, ఇతర వాహనాలు, ద్విచక్రవాహనాలు ఇష్టానుసారం నిలపడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు కష్టపడుతున్నారు. శుక్ర, ఆదివారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేవారితో రద్దీ మరింత పెరుగుతోంది. ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్