మచిలీపట్నంలో పెరిగిన డివిజన్లు

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిథిలో ఉన్న 50 డివిజన్ల సంఖ్యను 60కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల డివిజన్, వార్డుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2లక్షల జనాభా ఉన్న మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. త్వరలో డివిజన్ల విభజనను అధికారులు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్