గూడూరు: మండలంలో కలెక్టర్ డీకే బాలాజీ పర్యటన

వంతెన నిర్మాణాల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గూడూరు మండలంలోని పర్ణశాల ప్రధానమంత్రి సడక్ యోజన రహదారి మార్గంలో 3.38 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయితీరాజ్ శాఖ నిర్మిస్తున్న 32 మీటర్ల వంతెనను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వంతెనకు రీబౌండ్ హేమర్ కాంక్రీట్ పరీక్షను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్