మచిలీపట్నం: ఇంధన సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కృష్ణా జిల్లాలో పెట్రోలు, డీజిల్ సరఫరా సమస్యలపై ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 1967, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-252493కు తెలియజేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని 170 పెట్రోలు బంకుల్లో సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని, సమస్యలుంటే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి స్టాక్ తెప్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్