మచిలీపట్నం: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ లతో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. మంగినపూడి తీర ప్రాంతంలో రిసార్టుల ఏర్పాటు, 84 ఎకరాలలో పీతల పెంపకంపై చర్చించారు.

సంబంధిత పోస్ట్