కృష్ణా జిల్లా నూతన పంచాయతీ అధికారిగా ఎం. ధనలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పలమనేరులో డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ధనలక్ష్మిని ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న అరుణ, జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు.