మచిలీపట్నం: 'ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలి'

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో 'మీకోసం' కార్యక్రమం జరిగింది. జిల్లాలోని నాలుగు మూలల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్ కు అందించి తమ సమస్యలను వివరించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, భూములకు సంబంధించిన వ్యక్తిగతమైన సమస్యలపై అర్జీలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్