మచిలీపట్నం జిల్లా కోర్టు పరిధిలోని మహిళా బార్ అసోసియేషన్ స్లాబ్ గురువారం ఒకేసారి కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మహిళా న్యాయవాదులు అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది, అయితే ఫర్నిచర్ ధ్వంసమైంది. పురాతనమైన ఈ భవనానికి ప్రత్యేక నిధులు కేటాయించి పునర్నిర్మాణం చేస్తామని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.