మచిలీపట్నం: డిసెంబరు 31వ తేదీ నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి

ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుందని మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసు సింగపూర్ బృందం సభ్యులకు వివరించారు. బుధవారం సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో జిల్లాలో ఒకరోజు పర్యటనకు వచ్చిన సింగపూర్ బృందం కలెక్టరేట్లో సమావేశం అనంతరం బందరు ఓడరేవును సందర్శించారు. ఈ పర్యటనలో ఓడరేవు నిర్మాణ పురోగతిని వారు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్