మచిలీపట్నం: నేడు కలెక్టరేట్ లో మీకోసం

ఈ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

సంబంధిత పోస్ట్