పెన్షన్ పంపిణిని ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం 10వ డివిజన్లో సచివాలయం సిబ్బంది పనితీరు దీనికి విరుద్ధంగా ఉంది. శుక్రవారం మచిలీపట్నం 10వ డివిజన్ లో పెన్షన్ కోసం సచివాలయంకు వృద్ధులు చేరుకుంటున్నారు. ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయవలసి ఉండగా, బదిలీపై వచ్చిన నూతన సిబ్బంది కొంతమంది పెన్షన్ ను సచివాలయం వద్ద పంపిణీ చేస్తున్నారు.