ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు వికేంద్రీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.