ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో గ్యారేజ్ లో 37వ రోడ్డు భద్రత మాసోత్సవాలు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.