కృష్ణాజిల్లా అభివృద్ధిలో భాగంగా పోర్టు పనులను పరిశీలించడానికి నలుగురు సభ్యులతో కూడిన సింగపూర్ బృందం బుధవారం మచిలీపట్నం విచ్చేసింది. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సింగపూర్ బృందానికి స్వాగతం పలికి, పూల మొక్కను అందజేశారు. ఈ బృందం 40 శాతం పైగా పూర్తయిన పోర్టు పనులను పరిశీలించనుంది.