ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో స్థానిక జాలర్లు పడవను అడ్డుకున్నారు. విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన బోటును గుర్తించి, విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. కృష్ణా నది వరద ఉధృతిలో ప్రకాశం బ్యారేజి గేట్ల వద్దకు బోటు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగేది. గత సంవత్సరం బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజి గేటులో చిక్కుకున్న బోటును బయటకు తీయడానికి ఎనిమిది రోజులు పట్టిన శ్రమను అధికారులు గుర్తు చేసుకున్నారు.