ఇబ్రహీంపట్నంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ

ఇబ్రహీంపట్నంలో గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వార్డు కౌన్సిలర్ థరణికోట విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వెంకటరత్నం కలెక్టర్ కు పూర్తి వివరాలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్