ఇబ్రహీంపట్నం: పారిశుద్ధ్య లోపంతో అంటువ్యాధుల భయం

ఇబ్రహీంపట్నం 19వ వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది. రోడ్ల పక్కన చెత్త గుట్టలు, పూడికతో నిండిన డ్రైనేజీ కాలువలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీనితో స్థానికులు అంటువ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్