కృష్ణా నది వరద నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం చిన్న లంక గ్రామం వద్ద వరద నీటిని జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు. ప్రజలు వరదకు సంబంధించిన సమస్యలను 9154970454 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని, తక్షణం స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వరదలపై వదంతులను నమ్మవద్దన్నారు.