ఇబ్రహీంపట్నం: భారీ వాహనాలుతో ట్రాఫిక్కు అంతరాయం

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లలో గురువారం భారీ వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్ సైడ్ వ్యాపార కార్యకలాపాలు, ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే పార్క్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందని వాహనదారులు ఆరోపించారు. అధికారులు స్పందించి, వాహనాలు రోడ్లపై నిలబడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయాలని వాహనదారులు కోరారు.

సంబంధిత పోస్ట్