మైలవరం: కృష్ణ వాటర్ పైప్ లీక్

మైలవరంలోని దేవుడి చెరువు, పురుగుట్టకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద కృష్ణ వాటర్ పైప్ లైన్ లీక్ అవ్వడంతో సిమెంట్ రోడ్డు సైతం బద్దలైంది. ఈ సమస్య ఏర్పడి ఐదేళ్లకు పైగా అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయిన స్థానికులు, అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్