కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంకు, విలువైన స్థలాన్ని దానం చేసిన అక్కల గంగాధర్ నాయుడు (మునుసుబు) పేరు పెట్టారు. ఆయన కొండపల్లి పంచాయితీ మొదటి సర్పంచ్ గా సేవలందించారు. గత పాలకులు విఫలమైన ఈ పనిని ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పూర్తి చేశారు. ఈ నిర్ణయంపై అక్కల వారసులు, జనసేన మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) హర్షం వ్యక్తం చేశారు.