ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో సమీపంలోని కాలనీవాసులు, మహిళలు శుక్రవారం మురుగునీరు కలిసిన మంచినీరు తాగాల్సి వస్తుందని ఆందోళన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే తమ కాలనీ రహదారి పూర్తిగా మునిగిపోయి అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యను తెలిపినా పరిష్కారం కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.