నందిగామ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 20 అర్జీలు స్వీకరించామని తెలిపారు. అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.