నందిగామ: వరదల కారణంగా ఆ ప్రాంతాల ప్రజలకు అలర్ట్..!

ఎగువ ప్రాజెక్టుల నుంచి వరదల కారణంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు నీరు విడుదలవుతోందని నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ తెలిపారు. గురువారం ఉస్తేపల్లి, కాసారాబాద గ్రామాలను సందర్శించి కృష్ణా నది ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరిసరాల్లో తిరగకూడదని, పడవలు, ఈతకు వెళ్లరాదని సూచించారు. అధికారులకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్