నందిగామ: ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు

నందిగామ పట్టణ శివారు వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి నిర్మాణం కొనసాగుతున్నా, ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని వారు వాపోయారు. 95 శాతంపైగా పనులు పూర్తయ్యాయని, పూర్తిస్థాయిలో పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని స్థానికులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్