నందిగామ ట్రాఫిక్ పోలీసులు మానవత్వం, నిజాయితీని చాటుకున్నారు. బస్సులో ఒక మహిళ పోగొట్టుకున్న రూ. 6వేల నగదు, విలువైన పత్రాలు ఉన్న పర్సును కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, రవితేజ, శివరామకృష్ణలు అప్రమత్తంగా వ్యవహరించి, ఆధార్ వివరాల ఆధారంగా బాధితురాలు విజయభారతిని గుర్తించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్ సమక్షంలో ఆమెకు పర్సును అందజేశారు. పోలీసుల సేవాభావాన్ని బాధితురాలు కొనియాడారు.