చందాపురం ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన ఆయన, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆహారం, నీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు, గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అనుమానిత కేసులకు తక్షణ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.