నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.