మొవ్వ మండలం అయ్యంకి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తక్షణమే స్పందించి, క్షతగాత్రుని పరిస్థితిని గమనించి మానవత్వంతో ముందుకు వచ్చి బాధితునికి ధైర్యం చెప్పి, తక్షణమే వాహనాన్ని ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.